[racchabanda] సుభద్రా (కిరీటము) #subhadrA (kirITamu)#

 

సుభద్రా - 

ఆధారము - హేమచంద్రుడు, ప్రాకృతపైంగళము 
ఇతర నామములు - కిరీటము, మేదురదంతము 
నడక - చతురస్రగతి 
ఇది సవైయా రుపములో హిందీలో ప్రసిద్ధమైనది 

సుభద్రా (కిరీటము) - (భ)8 
24 సంకృతి 14380471 

పుట్టె సుభద్రకు - పూర్వము, దేవకి - మోయఁగ బందిగ-మున్, వసుదేవుఁడు 
పట్టిని జేర్చెను - భద్రముగా యదు-వంశవరేణ్యుని - వాసమునందున 
మట్టి భుజించఁగ - మాతయు రొప్పఁగ - మక్కువఁ జూపెను - మాయల సృష్టిని 
జెట్టులఁ గూల్చుచుఁ - జీరల దోఁచుచు - చిందిడు నవ్వులఁ - జెన్నుగ వర్ధిలె 

యతి, ప్రాసయతి రెండింటితో - 

నిండెను నింగియు - నిశ్చల కాంతుల 
నిండె నిశీథము - నీరవ శాంతుల
నిండెను నేలయు - నీలిమ ఛాయల 
నిండెను వెన్నెల - నేత్రపు సౌరుగ 
నిండె సుగంధము - నింపుచు గాలిని 
నిండెను వీనులు - స్నేహపు గీతుల 
నిండెను బాత్రయు - నేఁడిటఁ దేనెల 
నిండెను నామది - నీదు తలంపుల 

నాలుగు భ-గణముల్తో ఉండే వృత్తమును (12 జగతి 3511) మోదకము లేక భామినీ అంటారు. 

విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు
#
subhadrA - 

aadhAramu - hEmachaMdruDu, prAkRtapaiMgaLamu 
itara nAmamulu - kirITamu, mEduradaMtamu 
naDaka - chaturasragati 
idi savaiyA rupamulO hiMdIlO prasiddhamainadi 

subhadrA (kirITamu) - (bha)8 
24 saMkRti 14380471 

puTTe subhadraku - pUrvamu, dEvaki - mOya@Mga baMdiga-mun, vasudEvu@MDu 
paTTini jErchenu - bhadramugA yadu-vaMSavarENyuni - vAsamunaMduna 
maTTi bhujiMcha@Mga - mAtayu roppa@Mga - makkuva@M jUpenu - mAyala sRshTini 
jeTTula@M gUlchuchu@M - jIrala dO@Mchuchu - chiMdiDu navvula@M - jennuga vardhile 

yati, prAsayati reMDiMTitO - 

niMDenu niMgiyu - niSchala kAMtula 
niMDe niSIthamu - nIrava SAMtula
niMDenu nElayu - nIlima ChAyala 
niMDenu vennela - nEtrapu sauruga 
niMDe sugaMdhamu - niMpuchu gAlini 
niMDenu vInulu - snEhapu gItula 
niMDenu bAtrayu - nE@MDiTa@M dEnela 
niMDenu nAmadi - nIdu talaMpula 

nAlugu bha-gaNamultO umDE vRttamunu (12 jagati 3511) mOdakamu lEka bhAminI aMTAru. 

vidhEyuDu - jejjAla kRshNa mOhana rAvu
#

__._,_.___

Posted by: "J. K. Mohana Rao" <jkmrao@yahoo.com>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
To Post a message, send it to:   racchabanda@yahoogroups.com

To Unsubscribe, send a blank message to: racchabanda-unsubscribe@yahoogroups.com

SPONSORED LINKS
.

__,_._,___

[racchabanda] జయా (మంజుభాషిణీ) #jayA (maMjubhAshiNI)#

 

జయా (మంజుభాషిణీ) - 

ఆధారము - వృత్తరత్నాకరము 
ఇతర నామములు - కనకప్రభా, నందినీ, జయా, ప్రబోధితా, మనోవతి, విలంబితా, సునందినీ, సుమంగలీ 
లయ - రెండు పంచ మాత్రలు, ఒక అష్టమాత్ర

జయా - స/జ/స/జ/గ IIUI UIII - UIUIU
13 అతిజగతి 2796  

జయమౌను నీకెపుడు - శ్యామసుందరా 
ప్రియమైన రాగముల - ప్రేమమందిరా 
భయమేల మాకు నిల - బాలకృష్ణ నీ 
నయమైన మోము గన - నాక మబ్బుఁగా 

వికసించెఁ బుష్పములు - ప్రేమవాటిలో 
శుకమొండు పల్కె నట - సుందరమ్ముగా 
నకలంకుఁ బేరు విన - హర్ష వార్ధిలో 
సకలమ్ము నేమఱచి - సాఁగుచుంటిఁగా 

కన మంజుభాషిణిని - గానగంగ నా 
మనమందుఁ బుట్టెఁ గడు - మంజులధ్వనిన్ 
గనకప్రభారుచులు - కావ్యమయ్యె నా 
దినమయ్యె సుందరపు - తేనె జల్లుగా 

విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు 
#
jayA (maMjubhAshiNI) - 

aadhAramu - vRttaratnAkaramu 
itara nAmamulu - kanakaprabhA, naMdinI, jayA, prabOdhitA, manOvati, vilaMbitA, sunaMdinI, sumaMgalI 
laya - reMDu paMcha mAtralu, oka ashTamAtra

jayA - sa/ja/sa/ja/ga #IIUI UIII - UIUIU#
13 atijagati 2796  

jayamaunu nIkepuDu - SyAmasuMdarA 
priyamaina rAgamula - prEmamaMdirA 
bhayamEla mAku nila - bAlakRshNa nI 
nayamaina mOmu gana - nAka mabbu@MgA 

vikasiMche@M bushpamulu - prEmavATilO 
SukamoMDu palke naTa - suMdarammugA 
nakalaMku@M bEru vina - harsha vArdhilO 
sakalammu nEma~rachi - sA@MguchuMTi@MgA 

kana maMjubhAshiNini - gAnagaMga nA 
manamaMdu@M buTTe@M gaDu - maMjuladhvanin 
ganakaprabhAruchulu - kAvyamayye nA 
dinamayye suMdarapu - tEne jallugA 

vidhEyuDu - jejjAla kRshNa mOhana rAvu 
#

__._,_.___

Posted by: "J. K. Mohana Rao" <jkmrao@yahoo.com>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
To Post a message, send it to:   racchabanda@yahoogroups.com

To Unsubscribe, send a blank message to: racchabanda-unsubscribe@yahoogroups.com

SPONSORED LINKS
.

__,_._,___

Re: [racchabanda] You don't have to "see" the heaven!

 

cAlA  bAgumdi  Mohana  gArU,    dhanyavaadaalu.

In   this   respect,   let  me  narrate  an  incident  that  a  friend  of  mine  experienced.
One  morning  two   very  pretty  young  girls  knocked  on  his  door.   When  he  opened
the  door  he  saw  them.  They  asked  ``Sir  can   you  tell   us  your   religion?''
He  said   ``May  I  know   why  you  want  to  know?''.    They   said  ``Sir  our  Master  
told  us  that if   you   are  a   Christian, you    will   go  to  heaven,   otherwise  you 
will   go  to  hell''.  Then  he  asked  ``Are   you  girls  going  to  heaven?''.  They
replied  ``Sure    Sir,   we   do  a  lot  for  our  mission,  Jesus   will   definitely  take
us  to  heaven''.   He   replied  ``Maam  in  that  case,  if   you  have  no  objection,
we  prefer  going  to  Hell!!!!!!!.  

I  have   put  this  incident  in   my   recent  book  ``amma  gnApakAlu'',   that    you   can  see

Murty,   19  July  19.

On Fri, Jul 19, 2019 at 10:11 AM 'J. K. Mohana Rao' jkmrao@yahoo.com [racchabanda] <racchabanda@yahoogroups.com> wrote:


స్వర్గాన్ని చూడనక్కర లేదు!
 
బయట నిరంతర వర్షధార చేసే దడదడలు 
లోపల రసగంగలైన రక్త తరంగాల 
సరిగమల స్వరగమనాల సురావాలు 
తేమతో నిండిన ఘనీభవించిన వాతావరణంలో 
మల్లెపూల సుగంధము చెమట వాసన మధ్య పోరాటం 
స్వర్గానికి రుచి కూడ ఉంటుంది రాత్రిళ్లు 
నందనవనంలోని కల్పవృక్షానికి వేళ్లు 
చేతి కొనలలో నాట్యమాడే వేళ్లే 
ఆ వేళ్లు సంగీతాన్ని సృష్టించగలవు 
శాస్త్రాన్ని నిర్మించగలవు 
స్వర్గాన్ని చూపగలవు 

నిశీథిని కప్పే చీకటి పొరలలో 
అందరు గుడ్డివాళ్లే 
కాని కళ్లతో మాత్రమే 
స్వర్గాన్ని చూడనక్కర లేదు 
#
You don't have to see the heaven! 

The pelting sounds of 
the incessant rains outside,
and the gushing music of 
the bloody waves of feelings inside, 
and amid the supersaturated humidity 
the odors of sweat and flowers 
struggle to dominate 
and during the nights 
a sense of taste too is developed for the blissful heaven; 
just as the mythical wish fulfilling tree's roots
the dancing fingers at hands' ends 
can play divine music
can perform experiments of science  
and can explore the heaven too. 

When the layers of nocturnal blankets cover us
everyone is blind 
but one doesn't need to see 
the heaven just with eyes! 
#
__._,_.___

Posted by: Katta Murty <murty@umich.edu>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (2)
To Post a message, send it to:   racchabanda@yahoogroups.com

To Unsubscribe, send a blank message to: racchabanda-unsubscribe@yahoogroups.com

SPONSORED LINKS
.

__,_._,___

[racchabanda] You don't have to "see" the heaven!

 

స్వర్గాన్ని చూడనక్కర లేదు!
 
బయట నిరంతర వర్షధార చేసే దడదడలు 
లోపల రసగంగలైన రక్త తరంగాల 
సరిగమల స్వరగమనాల సురావాలు 
తేమతో నిండిన ఘనీభవించిన వాతావరణంలో 
మల్లెపూల సుగంధము చెమట వాసన మధ్య పోరాటం 
స్వర్గానికి రుచి కూడ ఉంటుంది రాత్రిళ్లు 
నందనవనంలోని కల్పవృక్షానికి వేళ్లు 
చేతి కొనలలో నాట్యమాడే వేళ్లే 
ఆ వేళ్లు సంగీతాన్ని సృష్టించగలవు 
శాస్త్రాన్ని నిర్మించగలవు 
స్వర్గాన్ని చూపగలవు 

నిశీథిని కప్పే చీకటి పొరలలో 
అందరు గుడ్డివాళ్లే 
కాని కళ్లతో మాత్రమే 
స్వర్గాన్ని చూడనక్కర లేదు 
#
You don't have to see the heaven! 

The pelting sounds of 
the incessant rains outside,
and the gushing music of 
the bloody waves of feelings inside, 
and amid the supersaturated humidity 
the odors of sweat and flowers 
struggle to dominate 
and during the nights 
a sense of taste too is developed for the blissful heaven; 
just as the mythical wish fulfilling tree's roots
the dancing fingers at hands' ends 
can play divine music
can perform experiments of science  
and can explore the heaven too. 

When the layers of nocturnal blankets cover us
everyone is blind 
but one doesn't need to see 
the heaven just with eyes! 
#


__._,_.___

Posted by: "J. K. Mohana Rao" <jkmrao@yahoo.com>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
To Post a message, send it to:   racchabanda@yahoogroups.com

To Unsubscribe, send a blank message to: racchabanda-unsubscribe@yahoogroups.com

SPONSORED LINKS
.

__,_._,___

[racchabanda] On the banks of river mAlinI

 

మాలినీ నదీతీరంలో 
హరిణాలను ముద్దాడే హరిణికి 
మల్లెలు మోసుకొస్తున్న తావిలో 
ఐ లవ్ యూ అన్న 
దుష్యంతుడిని కాను నేను 
మురుగు కాలువనుండి వెలువడే 
దుర్గంధాన్ని పీలుస్తూ 
నగరములోని కాంతి కాలుష్యంలో 
పాలిపోయిన దశమి చంద్రుని చూస్తూ 
అంతకంటే అందమైన నీ 
వెన్నెల మొగాన్ని తలుస్తూ 
నిద్రలో రమ్మని పిలుస్తూ 
పడుకొన్నాను 
ఆ దుష్యంతుడిలా కలలో కూడ 
నీశీలాన్ని భంగపరచను 
మరచిపోను మరువలేను 
ఇక ఉంటాను 
నాకు నేనే లాలి పాడుకొని నిద్రించాలి 
బహుశా కల గాంచాలి

#
I am not King dushyanta 
who uttered I love you to 
the fawn eyed maiden playing with the fawn 
amidst the fragrance borne by jasmine flowers 
on the banks of the river mAlinI

Breathing the odor of the fetid air 
and watching the pallid moon 
trying to outshine the polluted city lights 
I think of your moonlit face 
and invite you to partake my dreams

Even in my dreams 
I won't behave like that king 
and forget you 
How can I

Good night 
I'll try to sing and lull myself to sleep 

and perchance to dream!
#


__._,_.___

Posted by: "J. K. Mohana Rao" <jkmrao@yahoo.com>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
To Post a message, send it to:   racchabanda@yahoogroups.com

To Unsubscribe, send a blank message to: racchabanda-unsubscribe@yahoogroups.com

SPONSORED LINKS
.

__,_._,___

[racchabanda] జ్యోతిస్ (మిత్ర, కామక్రీడా, లీలాఖేల, సారంగీ) #jyOtis (mitra, kAmakrIDA, lIlAkhEla, sAraMgI)#

 

జ్యోతిస్ (మిత్ర, కామక్రీడా, లీలాఖేల, సారంగీ) 

ఆధారము - జయకీర్తి, హేమచంద్రుడు, వృత్తరత్నాకరము
పాదములో 15 గుర్వక్షరములు! 

జ్యోతిస్ (మిత్ర, కామక్రీడా, లీలాఖేల, సారంగీ) - (మ)5
15 అతిశక్వరి 1 

లీలాఖేలా దివ్యజ్యోతీ - లీలల్ సూపన్ రావేలా 
బాలుండీవా నోటన్ జూపన్ - బ్రహ్మాండమ్ముల్ దోచెన్గా 
నీలాకారా శీలీ మాలీ - నీవేగాదా సర్వ మ్మీ 
నేలన్ నింగిన్ నీరూపమ్మే - నిత్యానందమ్మై నిల్చెన్ 

దేవీ దీప్తిన్ వెల్గించంగా - దివ్యమ్మై యీ జీవమ్మున్ 
భావాతీతా భావాంభోధీ - వాగర్థమ్మై భవ్యమ్మై 
శ్రీవిశ్వేశీ విశ్వామిత్రీ - చిద్రూపమ్మై శీఘ్రమ్మై 
ప్రోవన్ రావా కావన్ రావా - త్రోవన్ జూపన్ తృప్తమ్మై 

విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు
#
jyOtis (mitra, kAmakrIDA, lIlAkhEla, sAraMgI) 

aadhAramu - jayakIrti, hEmachaMdruDu, vRttaratnAkaramu
pAdamulO 15 gurvaxaramulu! 

jyOtis (mitra, kAmakrIDA, lIlAkhEla, sAraMgI) - (ma)5
15 atiSakvari 1 

lIlAkhElA divyajyOtI - lIlal sUpan rAvElA 
bAluMDIvA nOTan jUpan - brahmAMDammul dOchen&gA 
nIlAkArA SIlI mAlI - nIvEgAdA sarva mmI 
nElan niMgin nIrUpammE - nityAnaMdammai nilchen 

dEvI dIptin velgiMchaMgA - divyammai yI jIvammun 
bhAvAtItA bhAvAMbhoedhI - vAgarthammai bhavyammai 
SrIviSvESI viSvAmitrI - chidrUpammai SIghrammai 
prOvan rAvA kAvan rAvA - trOvan jUpan tRptammai 

vidhEyuDu - jejjAla kRshNa mOhana rAvu
#

__._,_.___

Posted by: "J. K. Mohana Rao" <jkmrao@yahoo.com>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
To Post a message, send it to:   racchabanda@yahoogroups.com

To Unsubscribe, send a blank message to: racchabanda-unsubscribe@yahoogroups.com

SPONSORED LINKS
.

__,_._,___