[racchabanda] యదు (జాతి పద్యము) #yadu (jAti padyamu)#

 

యదు (జాతి పద్యము) - 

ఆధారము - పట్వర్ధన్ ఛందోరచనా (మరాఠీ) 
బేసి పాదములు - 2 + 8 మాత్రలు + లగ 
సరి పాదములు - 8 + 8 + 8 మాత్రలు + లగ 

యదుకులతిలకా మురహరా
మృదుతరహృదయా - నృత్యకలాగ్రణి - ప్రేమపూర్ణ శుభకరా 
మదగజహరణా సురవరా 
మధురమధుర మురళీ - మంజుల గానము - మది హరించె వరద రా 

చిగురుటధరముల ప్రియసఖీ 
రగులుచు నుంటిని - రాగము నింపఁగ - రావేల యిందుముఖీ 
సగమిది రాత్రియుఁ జల్లఁగా 
మొగమును జూపఁగ - మోహనమ్ముగా - ముందు రమ్ము మెల్లఁగా 

సామజవరగమనా హరీ 
ప్రేమస్వరూప - ప్రియ మృదుభాషా - శ్రీశా నయవాక్ఝరీ 
కామేశ్వర కమలేక్షణా 
రామానుజ రా - రాధికేశ్వరా - రాసాగ్రణి నిర్గుణా 

విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు
#
yadu (jAti padyamu) - 

aadhAramu - paTvardhan ChaMdOrachanA (marAThI) 
bEsi pAdamulu - 2 + 8 mAtralu + laga 
sari pAdamulu - 8 + 8 + 8 mAtralu + laga 

yadukulatilakA muraharA
mRdutarahRdayA - nRtyakalAgraNi - prEmapUrNa SubhakarA 
madagajaharaNA suravarA 
madhuramadhura muraLI - maMjula gAnamu - madi hariMche varada rA 

chiguruTadharamula priyasakhI 
raguluchu nuMTini - rAgamu niMpa@Mga - rAvEla yiMdumukhI 
sagamidi rAtriyu@M jalla@MgA 
mogamunu jUpa@Mga - mOhanammugA - muMdu rammu mella@MgA 

sAmajavaragamanA harI 
prEmasvarUpa - priya mRdubhAshA - SrISA nayavAkjharI 
kAmESvara kamalExaNA 
rAmAnuja rA - rAdhikESvarA - rAsAgraNi nirguNA 

vidhEyuDu - jejjAla kRshNa mOhana rAvu
#

__._,_.___

Posted by: "J. K. Mohana Rao" <jkmrao@yahoo.com>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
To Post a message, send it to:   racchabanda@yahoogroups.com

To Unsubscribe, send a blank message to: racchabanda-unsubscribe@yahoogroups.com

SPONSORED LINKS
.

__,_._,___

[racchabanda] మణికిరణము #maNikiraNamu#

 

మణికిరణము - 

ఆధారము - జయకీర్తి 
సూత్రము - ననభనజననర్ననలగమిహ 
చేన్మునిగిరివసుయతిరితి మణికిరణః 
(ముని, గిరి - 7, వసు - 8)

మణికిరణము - న/న/భ/న/జ/(న)4/లగ
IIII IIU - IIII IIU - IIII IIII - IIII IIU

తనరుచు వెడలెన్ - దరళిత తనువున్ - దనుజులఁ దునిమిన - తరుణుఁడు మిసతో 
మనసిజుఁ బిత యా - మణుగుల మణితో - మధుర హసనమున - మఱలెను సతితో 
కనుగవ కితవై - కనకపు గనియై - ఖరకిరణునివలె - గమనము సలిపెన్  
వనరుహనయనున్ - వరదుని వనితల్ - వరముల నడిగిరి - ప్రణమిలి బగితిన్ 

ఇందులోని కంద పద్యములు -

తనరుచు వెడలెన్ దరళిత 
తనువున్ దనుజులఁ దునిమిన - తరుణుఁడు మిసతో 
మనసిజుఁ బిత యా మణుగుల 
మణితో మధుర హసనమున - మఱలెను సతితో 
కనుగవ కితవై కనకపు 
గనియై ఖరకిరణునివలె - గమనము సలిపెన్ - 
వనరుహనయనున్ వరదుని 
వనితల్ వరముల నడిగిరి - ప్రణమిలి బగితిన్ 

విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు
#
maNikiraNamu - 

aadhAramu - jayakIrti 
sUtramu - nanabhanajananarnanalagamiha 
chEnmunigirivasuyatiriti maNikiraNa@h 
(muni, giri - 7, vasu - 8)

maNikiraNamu - na/na/bha/na/ja/(na)4/laga
#IIII IIU - IIII IIU - IIII IIII - IIII IIU#

tanaruchu veDalen - daraLita tanuvun - danujula@M dunimina - taruNu@MDu misatO 
manasiju@M bita yA - maNugula maNitO - madhura hasanamuna - ma~ralenu satitO 
kanugava kitavai - kanakapu ganiyai - kharakiraNunivale - gamanamu salipen  
vanaruhanayanun - varaduni vanital - varamula naDigiri - praNamili bagitin 

iMdulOni kaMda padyamulu -

tanaruchu veDalen daraLita 
tanuvun danujula@M dunimina - taruNu@MDu misatO 
manasiju@M bita yA maNugula 
maNitO madhura hasanamuna - ma~ralenu satitO 
kanugava kitavai kanakapu 
ganiyai kharakiraNunivale - gamanamu salipen - 
vanaruhanayanun varaduni 
vanital varamula naDigiri - praNamili bagitin 

vidhEyuDu - jejjAla kRshNa mOhana rAvu
#

__._,_.___

Posted by: "J. K. Mohana Rao" <jkmrao@yahoo.com>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
To Post a message, send it to:   racchabanda@yahoogroups.com

To Unsubscribe, send a blank message to: racchabanda-unsubscribe@yahoogroups.com

SPONSORED LINKS
.

__,_._,___

[racchabanda] రచ్చబండ కవితలు

 

Beyond

 

ఆ ఉదయపు ఉద్రేకపు దడదడ అది నాది కాదు నేపుల్స్ జడివానది

ఆ అలజడి నా లోది కాదు, బైట ఆగకుండా ఉరిమే ఉరుములది

ఆ రణగొణ కింద కంచెలు ట్రిమ్ చేసే రంపాలది 

ఆ టకటక లకుముకి పిట్టది 

ఏ ధ్వనీ నాది కాదు,

 

కొన్ని రోజులు నేనసలు మాట్లాడనవసరమే లేదు. ఐనా గాని

మాటలు మర్చిపోతానేమో అని, అప్పుడప్పుడు

కారు బైటకు తీసి, బ్రంచ్ కో, డిన్నర్ కో,

ఏ ఫార్మసీకో, హెయిర్ కట్ కో

వెళ్లొస్తుంటా.

 

ఐతే, డబ్బు అనేది కట్టకపోతే, నాకు అవి కూడా లేవు.

ఆ డబ్బు అనేది ముందు ముగుస్తుందా

నేను ముందు ముగుస్తానా

అని నేను మౌనంగా

ఆలోచిస్తా.

 

Lyla


__._,_.___

Posted by: lylayfl@aol.com
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (191)
To Post a message, send it to:   racchabanda@yahoogroups.com

To Unsubscribe, send a blank message to: racchabanda-unsubscribe@yahoogroups.com

SPONSORED LINKS
.

__,_._,___