[racchabanda] దయఁజూపుమోయమ్మ .....

 

దయఁజూపుమోయమ్మ

=====================

--

ద్విపద (చతుష్పదలుగా )
--

గణములు -- ఇం.ఇం.ఇం.సూ

యతి-- మూడవగణము మొదటి యక్షరము

ప్రాస నియతము

--

వేదాంత వీధులన్ విహరించు తల్లి

ఛేదింపవే వేగఁ జీకట్ల లోన

మోదమ్ముగా నిన్నుఁ బూజించుకొందు

నీదైన వాణితో నేఁబ్రీతినుందు

--

నీ వెల్గు రూపమ్ము నేఁ గాంచుటెపుడొ

నీవీణ రీతిగా నేఁ బాడుటెపుడొ

ఆవేదనయె లేక యలరారుటెపుడొ

నీవె సర్వమ్ముగా నే మించుటెపుడొ

--

రాగమ్ము లేకుండ రమియించుటెపుడొ

వాగీశి రీతిగాఁ బలుకాడుటెపుడొ

త్యాగమున్ నీవెంచఁ దనరారుటెపుడొ

యోగమే ప్రీతిగా నులసిల్లుటెపుడొ

--

ఆశలే లేకుండ నర్చించుటెపుడొ

పాశముల్ ఛేదించి ప్రముదించు టెపుడొ

నీ సేవలన్ సల్పి నేఁబొంగుటెపుడొ

వాసిగా నినుఁ గూర్చి ప్రణుతించు టెపుడొ

--

చెలిమి కానుకనిచ్చి చెంతఁ గూర్చుందు

పలుకులే పూలుగాఁ బాదాల నిడుదు

తలఁపు నివ్వాళితోఁ తనివి గొమ్మందు

కలిగినట్టిది పెట్టి కైమోడ్చుచుందు

--

చేరవచ్చితివమ్మ శ్రీ వాణి ననుచు

పారఁజేసెదవేవొ పద్యమ్ములనుచు

మారు పల్కకనిన్ను మన్నింతుననుచు

దారి మార్చితివీవు తగినట్టిదనుచు

--

భయమేదొ నాలోన భావింప దాని

శ్రియము గూర్చునటంచుఁ జెప్పినన్ గాని.

నయముగా ధృతినిచ్చి నడిపింపఁ బూని

దయఁజూపుమోయమ్మ తగురీతి వాణి

--

సుప్రభ

11:20 AM

08-13-2019


__._,_.___

Posted by: suprabha u <saarada@yahoo.com>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
To Post a message, send it to:   racchabanda@yahoogroups.com

To Unsubscribe, send a blank message to: racchabanda-unsubscribe@yahoogroups.com

.

__,_._,___